Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుండె ఆరోగ్యం విషయంలో చేయాల్సినవి.. చేయకూడనివి!

Heart health Dos and donots to keep your heart safe in 2023
Advertisement
  • ట్రాన్స్ ఫ్యాట్, చెడు కొవ్వులు ఉండేవాటికి దూరం
  • సంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి
  • తగినంత నిద్ర, వ్యాయామాలతో గుండెకు రక్షణ
Advertisement
ఇష్టమొచ్చింది తింటే అధిక చెడు కొలెస్ట్రాల్, అధిక బరువుకు దారితీస్తుంది. అంతేకాదు రక్తపోటు, మధుమేహం కూడా పలకరించే ప్రమాదం ఉంటుంది. అందుకే దేనికీ అతి పనికిరాదనే సూత్రాన్ని గుర్తు పెట్టుకోవాలి. మితాహారం ఆరోగ్యానికి మంచిది. 

ఆల్కహాల్ సేవనం, ఫ్యాటీ, కార్బోహైడ్రేట్స్ పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల కార్డియాక్ అరెస్ట్ వంటి ప్రమాదాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్డియోమయోపతికి అధిక ఆల్కహాల్ సేవనం, తీసుకునే ఆహారం ప్రధాన కారణాలుగా గుర్తించారు. కార్డియో మయోపతి అంటే గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తగ్గడం. కనుక మంచి చేసే ఆహారాన్ని మితంగా తీసుకోవడానికి పరిమితం కావాలి.

బ్రెడ్ తదితర మైదా ఉత్పత్తులు, మాంసాహారానికి బదులు సంప్రదాయ భారతీయ ఆహారానికి పరిమితం కావాలి. తక్కువ ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్ తక్కువ ఉండే వాటితో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఏమీ ఉండవని వైద్యులు అంటున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండె కొట్టుకునే తీరు ప్రభావితమవుతుంది. అంటే గతితప్పుతుంది. అట్రియల్ ఫిబ్రిల్లేషన్ (గుండె అతి వేగంగా కొట్టుకోవడం) రిస్క్ ను పెంచుతుంది. దీనికి నిద్ర తగ్గితే మరింత ముప్పు ఎదురవుతుంది. నిద్ర తగ్గి, గుండె అతి వేగంగా కొట్టుకుంటే అతి హార్ట్ ఫెయిల్యూర్ లేదా స్ట్రోక్ కు దారితీయవచ్చు. మంచి గాఢ నిద్ర, సరిపడా ఉండేలా చూసుకుంటే రోగ నిరోధక శక్తి పునరుజ్జీవం అవుతుంది. అలాగే, గుండె ఆరోగ్యం కూడా పటిష్టమవుతుంది. 

  • రోజువారీ వ్యాయామం చేయాలి. 30-40 నిమిషాలు ఇందుకు కేటాయించాలి. వేగవంతమైన నడక (చెమటలు పట్టేలా), లేదంటే మోస్తరు పరుగు, ఏరోబిక్ వ్యాయామాలు, స్విమ్మింగ్ చేయవచ్చు. డ్యాన్స్ కూడా వ్యాయామం కిందకు వస్తుంది.
  • భోజనం నుంచి భోజనానికి మధ్యలో పండ్లు, నట్స్ మినహా మరే ఇతర చెత్తను తీసుకోకుండా ఉంటే మంచిది. 
  • భోజనంలో భాగంగా అధికంగా ప్రాసెస్ చేసినవి, వేయించినవి తీసుకోవద్దు. ఆరోగ్యకరమైన వాటికి చోటివ్వాలి. 
  • రోజవారీగా తీసుకోవాల్సిన ఔషధాలకు బ్రేక్ ఇవ్వకూడదు. ఆల్కహాల్ తీసుకున్న సమయంలో ట్ల్యాబ్లెట్లు వేసుకోకూడదు. 
  • వ్యాయామాల వల్ల రాత్రి పూట మంచి నిద్ర పడుతుంది. అందుకే వ్యాయామాలు తప్పనిసరి. అర్ధరాత్రి తర్వాత కూడా మేల్కొని ఉంటే అది అనారోగ్య సమస్యలకు దగ్గరి దారి అవుతుంది.
Advertisement
Advertisement
Heart
health
tips
healthy food
good sleep
avoid junk food

More Telugu News